calender_icon.png 10 October, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య రంగంలో భారత్ విశ్వగురు కావాలి

10-10-2025 12:07:48 AM

  1. దేశంలో మెడికల్ టూరిజం పెరిగింది
  2. వ్యాక్సిన్లు, మందుల తయారీలో టాప్‌లో ఉన్నాం
  3. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ అక్టోబర్ 9: వైద్య రంగంలో భారత్ విశ్వ గురువు కావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. దేశంలో మెడికల్ టూరిజం పెరిగిందని, వ్యాక్సిన్లు, మందులు తయారీలో భారత్ టాప్‌లో ఉందన్నారు. డాక్టర్ విజయనంద్ రచించిన ‘నేను క్యాన్సర్‌ను జయించాను’ అనే పుస్తకాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ డయాబెటస్ సమస్య కూడా దేశంలో పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలో అత్యధిక డయాబెటిస్ బాధితులు హైదరాబాద్ లోనే ఉన్నారని పేర్కొన్నారు. విదేశాలతో పోలిస్తే భారత్‌లో మెరుగైన వైద్యం అందుతుందని స్పష్టం చేశారు. భారత్ వైద్యరంగం లో వసతులు మరింత పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.  ఎంబీ బీఎస్ పీజీ సీట్లు కేంద్ర ప్రభుత్వం పెంచిందని, గతంలో 387 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు 808 మెడికల్ కాలేజీ లు ఉన్నాయని ఆయన చెప్పారు.

రోగులపట్ల నిజమైన దేవుళ్లు డాక్టర్లే అని స్పష్టం చేశారు. క్యాన్సర్ వస్తే ప్రాణంపై ఆశలు ఉండవు అని వివరించారు. కానీ ఇప్పుడు క్యాన్సర్‌ను ఎంతోమంది జయిస్తున్నారని అన్నారు. దీంతో బాధితుల్లో క్యాన్సర్‌ను గెలుస్తామనే విశ్వాసం పెరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. మెడిసిన్ మాత్రమే కాదు, డాక్టర్లు ఇచ్చే విశ్వాసం కూడా రోగులను బతికిస్తోందన్నారు. భారతదేశంలో రోజురోజుకు క్యాన్స ర్ పేషెంట్లు పెరుగుతున్నారని గుర్తు చేశారు.

క్యాన్సర్ వచ్చాక దాన్ని జయించిన సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయని చెప్పారు. కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యాక కోలుకున్న వాళ్లు మాత్రం తక్కువగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుష్మా స్వరాజ్, అరుణ్ అరుణ్ జెట్లీలతో పాటు ఎంతోమంది కిడ్నీ ఫెయిల్యూర్తో చనిపోయారని గుర్తు చేశారు. కిడ్నీల విషయంలో మరింత పరిశోధనలు జరగాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.