10-10-2025 12:00:00 AM
ప్రారంభించిన మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెల సందర్భంగా మహిళల్లో క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించి, ప్రారంభ దశలోనే గుర్తించే లక్ష్యంతో మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్, హైటెక్ సిటీ, ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కూపన్లను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా డా. ఎల్. జయంతిరెడ్డి, గైనకాలజిస్టు, ఓజీహెచ్‌ఎస్ అధ్యక్షురాలు హాజరయ్యారు.
గౌరవ అతిథిగా డా. సబిత గోడసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్య సంరక్షణలో మెడికవర్ హాస్పిటల్స్ ఎల్లప్పుడూ ముందంజలో ఉందని తెలిపారు. ఉచిత స్క్రీనింగ్ కూపన్ల కార్యక్రమం మహిళల ఆరోగ్య రక్షణకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కూపన్లు అక్టోబర్ 31 వరకు మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్, హైటెక్ సిటీలో అందుబాటులో ఉంటాయి.
మహిళలు తమ ఆరోగ్య పరీక్షలను ప్రాధాన్యతగా తీసుకోవాలని వైద్యులు సూచించారు. స్క్రీనింగ్‌లో భాగంగా క్యాన్సర్ నిపుణుల కన్సల్టేషన్, మామోగ్రామ్ (బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్), పాప్ స్మియర్ (సర్వికల్ క్యాన్సర్ పరీక్ష) మరియు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ వంటి పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి.