22 June, 2026 | 8:02 PM

Breaking News

ప్రభుత్వ విప్ విజయరమణ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్, బీజేపీ నాయకులు..   •   పెన్షనర్ ల సమస్యను పరిష్కరించండి   •   పెంచిన ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలు తక్షణమే తగ్గించాలి   •   ప్రైమరీ టీచర్ల భర్తీలలో జిల్లా వ్యాప్తంగా ఒకే విధానం కొనసాగాలి   •   కోయగూడెం ఓసీపీలో సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) తిరుమల రావు పర్యటన   •   అమెరికాలో గంగారం యువకుడు మృతి   •   విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •   గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్   •  

పాక్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టిన భారత్

10-11-2024 01:50 AM

ఐరాసలో ఆ దేశానికి మొట్టికాయలు

న్యూఢిల్లీ, నవంబర్ 9: శాంతి పరిరక్షణ చర్యలపై ఐక్యరాజ్యసమితిలో పాక్ చేసిన అసత్య ప్రచారాన్ని భారత్ తిప్పికొట్టింది. జమ్ముకశ్మీర్ అంశాన్ని మరోసారి లేవనెత్తిన పాకిస్థాన్‌కు మొట్టికాయలు వేసింది. ‘మనమందరం సమావేశమైన ఉద్ధేశాన్ని పాక్ పక్కదారి పట్టించేలా వ్యవహరించింది. ఆ దేశానికి సమాధానం చెప్పే హక్కు భారత్‌పై ఉంది. జమ్ముకశ్మీర్ ఇప్పుడూ.. ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. తాజాగా అక్కడి ప్రజలు కొత్త ప్రభుత్వా న్ని ఎన్నుకున్నారు. పాకిస్థాన్ తన అసత్య ప్రచారాన్ని ఇప్పటికైనా మా నుకోవాలి’ అని రాజ్యసభ ఎంపీ, బీజేపీ ప్రతినిధి సుధాన్షు త్రివేది ఘాటుగా బదులిచ్చారు.