7 April, 2026 | 1:38 PM

Breaking News

కేరళ సీఎంకు తెలంగాణ సీఎం సవాల్!   •   తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   షాకింగ్ ఘటన: బంధువుల దాడిలో న్యాయవాది హత్య.. అన్నమయ్య జిల్లాలో కలకలం!   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •  

వార్మప్ అదిరింది

05-02-2026 01:35 AM

సౌతాఫ్రికాపై భారత్ విజయం

ఇషాన్ కిషన్ విధ్వంసం

తిలక్, సూర్యకుమార్ మెరుపులు

నవీ ముంబై, ఫిబ్రవరి 4 : టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత క్రికెట్ జట్టు జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఇటీవలే న్యూజిలాండ్ పై 4-1తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా తాజాగా వార్మప్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. మెగా టోర్నీకి చివరి సన్నాహకంగా మిగిలిన వార్మప్ మ్యా చ్‌లో భారత బ్యాటర్లు పూర్తిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నారు. ఊహించినట్టుగానే ఇషాన్ కిషన్‌ను అభిషేక్ శర్మకు తోడుగా ఓపెనింగ్‌కు పంపించారు. మరోసారి తనకిచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించు కున్న ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. క్రీజులోకి వచ్చీరావడంతోనే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 20 బం తుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 53 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్ అయ్యాడు.

వార్మప్ మ్యాచ్ కావడంతో అందరికీ బ్యాటింగ్ అవకాశం ఇచ్చే ఉద్దేశంతో రిటైర్డ్ ఔట్  అవ్వడం సాధారణంగానే జరుగుతుంది. తొలి వికెట్‌కు అభి షేక్ శర్మ, ఇషాన్ కిషన్ 5.4ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ 18 బంతుల్లో 23 పరుగులు చేయగా.. తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అలరించారు. గా యం నుంచి కోలుకున్న తిలక్ వర్మ తన సహజశైలి బ్యాటింగ్‌తో మరోసారి మెరుపులు మెరిపించాడు.

తిలక్ వర్మ 19 బంతు ల్లో 45 (3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ 16 బంతుల్లో 30, అక్షర్ పటేల్ 35, రింకూ సింగ్ 10 పరుగులు చేశారు. చివర్లో హార్థిక్ పాండ్యా మెరుపు బ్యాటింగ్ భారీస్కోరును అందించింది. పాండ్యా కేవలం 10 బంతుల్లోనే 30 ( 2 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 240 పరుగులు చేసింది. భారత బ్యాట ర్ల దెబ్బకు సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ( 0/44 ), నోర్జే (1/57) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. తర్వాత ఛేజింగ్‌లో సౌతాఫ్రికా ఆరంభం నుంచే తడబడింది. 

తొలి ఓవర్లోనే లిండే వికెట్ కోల్పోయింది. అయితే మార్క్ క్రమ్ (38) , రికెల్టన్ (44) మెరుపులతో దూకుడు కొనసాగించినా వరుస వికెట్లు కోల్పోయింది. భారత స్పిన్న ర్లు ఎప్పటికప్పుడు వికెట్లు తీస్తూ సౌతాఫ్రికాను దెబ్బకొట్టారు. తర్వాత స్టబ్స్ , మార్కో యెన్సన్ చివర్లో మెరుపులు మెరిపించినా పరుగుల అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు. మొత్తం మీద ప్రపంచకప్ కు ముందు అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు ఫామ్ అందుకోవడం అభిమానులను ఖుషీ చేస్తోంది.