దక్షిణాఫ్రికాతో భారత మహిళల జట్టు ఢీ
బెంగళూరు: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో బిజీగా ఉన్న భారత మహిళల జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం విడుదల చేసింది. జూన్, జూలైలో జరగనున్న ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. వన్డేలు, టీ20లకు బెంగళూరు వేదిక కానుండగా.. ఏకైక టెస్టు మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యమివ్వనుంది. జూన్ 16 నుంచి మొదలు కానున్న సిరీస్‌లో మొదట వన్డేలు ఆడనున్న హర్మన్ సేన జూన్ 28న చెన్నైలో సౌతాఫ్రికాతో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. అనంతరం జూలై 5, 7, 9 తేదీల్లో ఇరుజట్ల మధ్య టీ20లు జరగనున్నాయి. సెప్టెంబర్ బంగ్లాదేశ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ ప్లాన్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. ఇక బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3 సిరీస్‌ను కైవసం చేసుకుంది.






