12 July, 2026 | 9:27 PM

మళ్లీ ఆ ఇద్దరి మధ్యే..

04-05-2024 12:51 AM

మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో సబలెంకా, స్వియాటెక్

మాడ్రిడ్: ప్రపంచ రెండో ర్యాంకర్ అరీనా సబలెంకా (బెలారస్) మాడ్రిడ్ ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సబలెంకా 1 7 7 (7/5)తో 4వ సీడ్ ఎలీనా రైబకినా (కజకిస్థాన్)ను ఓడించింది. నేడు జరగనున్న తుది పోరులో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్)తో సబలెంకా అమీతుమీ తేల్చుకోనుంది. కాగా గతేడాది ఈ ఇద్దరి మధ్యే ఫైనల్ ఫైట్ జరగ్గా సబలెంకా చాంపియన్‌గా నిలిచింది.

దీంతో గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకున్న స్వియాటెక్ ఈసారి సబలెంకాపై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. కాగా సెమీస్ పోరులో సబలెంకాకు రైబకినా నుంచి గట్టి పోటీ ఎదురైంది. అద్వితీయ సర్వీస్‌లతో రెచ్చిపోయిన రైబకినా తొలి సెట్‌ను 6 కైవసం చేసుకోగా.. ఆ తర్వాత పుంజుకున్న సబలెంక రెండో సెట్లో సత్తాచాటి స్కోరు సమం చేసింది. ఇక నువ్వా నేనా అన్నట్లు సాగిన నిర్ణయాత్మక సెట్‌లో ఇద్దరు హోరాహోరీగా తలపడడంతో సెట్ టై బ్రేక్‌కు దారి తీసింది. అయితే టై బ్రేక్‌లో రైబకినాను ఓడించిన సబలెంకా ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక పురుషుల సింగిల్స్‌లో రుబ్లెవ్ తుదిపోరుకు చేరుకున్నాడు.