17-06-2025 10:54:18 AM
న్యూఢిల్లీ: ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతల(Iran-Israel) దృష్ట్యా భారత ఎంబసీ అప్రమత్తం అయింది. ఇరాన్(Iran)లోని భారత ఎంబసీ టెహ్రాన్ లో భారతీయులను అప్రమత్తం చేసింది. టెహ్రాన్ ను ఖాళీ చేయాలని భారతీయులకు ఇరాన్ లోని భారత ఎంబసీ(Indian Embassy) సూచించింది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని భారత రాయబార కార్యాలయం సలహా ఇచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం దృష్ట్యా, విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs of India) మంగళవారం న్యూఢిల్లీలో 24x7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు సహాయం చేయడానికి అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది.
"ఇరాన్, ఇజ్రాయెల్‌లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా విదేశాంగ మంత్రిత్వ శాఖలో 24x7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది" అని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ లో ఒక పోస్ట్‌లో రాశారు. టెహ్రాన్ లోని భారతీయులు లొకేషన్ వివరాలు తెలపాలని భారతీయులకు రాయబార కార్యాలయం విజ్ఞప్తి చేసింది. 989010144557, 989128109115, నంబర్లకు లొకేషన్ తెలియజేయాలని కోరారు. 989128109109 నంబర్ కు ఫోన్ చేసి లొకేషన్ తెలపాలని భారతీయులకు భారత ఎంబసీ కోరింది. టెహ్రాన్ ను ఖాళీ చేయాలని ఇప్పటికే ఇరాన్ పౌరులకు యూఎస్, ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ -ఇరాన్ మధ్య మంగళవారం వరుసగా ఐదవ రోజుకు చేరుకున్నందున, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రజలను టెహ్రాన్ నుండి ఖాళీ చేయాలని హెచ్చరించారు.
1800118797 (టోల్ ఫ్రీ)
+91-11-23012113
+91-11-23014104
+91-11-23017905
+91-9968291988 (వాట్సాప్)
అదనంగా, ఇరాన్‌లోని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం, దిగువ సంప్రదింపు వివరాలతో 24/7 అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది:
కాల్ కోసం మాత్రమే:
1. +98 9128109115, +98 9128109109
వాట్సాప్ కోసం:
2. +98 901044557, +98 9015993320, +91 8086871709.
3. బందర్ అబ్బాస్: +98 9177699036
4. జహెదాన్: +98 9396356649