విద్యుత్ రంగంలో కొత్త విధానాలు: భట్టి విక్రమార్క
05-07-2024 01:21 PM
హైదరాబాద్: హైటెక్స్ లో ఇండియన్ ఫార్మాసూటికల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఫార్మా రంగ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున విదేశాలకు ఫార్మా ఎగుమతులవుతున్నాయని పేర్కొన్నారు. ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల మేర ఫార్మా ఎగుమతులు కానున్నాయన్నారు. ఫార్మా క్లస్టర్లను బాహ్యవలయ రహదారి వెలుపల ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో కొత్త విధానాలు తీసుకువస్తామని భట్టివిక్రమార్క వెల్లడించారు.






