26 June, 2026 | 6:31 PM

Breaking News

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •  

ఇరాన్ నుంచి ఆర్మేనియాకు భారత విద్యార్థులు

18-06-2025 12:44 AM

న్యూఢిల్లీ, జూన్ 17: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెల కొన్న నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి భారతీయ విద్యార్థులను తరలించే ప్రక్రియను భారత్ ప్రారంభించింది. ఇప్పటికే 110 మంది భారతీయులతో కూడిన తొలి బృందం ఇరాన్ నుంచి ఆర్మేనియాకు క్షేమంగా చేరుకుంది. వీరంతా నేడు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్నారు. 

ఇరాన్‌లో వివిధ విశ్వవిద్యాల యాల్లో భారత్‌కు చెందిన 10 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. టెహ్రాన్‌ను వీడాలని ట్రంప్ చేసిన హెచ్చరికలతో ఇరాన్‌లోని భార త రాయబార కార్యాలయం మరింత అప్రమత్తమైం ది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొ న్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని పేర్కొంది.

సొంత రవాణా సదుపాయం ఉన్నవారు తక్షణమే టె హ్రాన్ వీడి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలన్నారు. అం తేకాదు ఇరాన్‌లో చిక్కుకున్న విద్యార్థులను వీలైనంత త్వరగా తరలిచేందుకు ఏర్పాట్లు చేసిం ది. అందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబ ర్లు ఏర్పాటు చేశారు.