అనుభవమే గెలిపించింది
- మెడల్ సులభంగా రాలేదు
- ఆసియా క్రీడల స్వర్ణంపై సంజూ శాంసన్ వ్యాఖ్యలు
ముంబై, అక్టోబర్ 4 : ఆసియా క్రీడల పురుషుల క్రికెట్(Asian Games men's cricket) ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 19 పరుగుల తేడాతో ఓడించి భారత్ వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ చారిత్రాత్మక విజయంపై భారత వికెట్ కీపర్ సంజూ శాం సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం తమకు అంత సులభంగా దక్కలేదని, దీని కోసం ఆట గాళ్లందరూ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించాడు.
ఫైనల్ మ్యాచ్‌లో తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోవడంలో జట్టు అనుభవం కీలక పాత్ర పోషించిందని చెప్పాడు. భారత క్రికెట్ బోర్డు పూర్తి స్థాయి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూ డిన జట్టును టోర్నీకి పంపడం ఎంతో సహాయపడిందని తెలిపాడు. ‘మాది చాలా అనుభవం ఉన్న జట్టు. ప్రాక్టీస్ లేదా మ్యాచ్‌లు లేనప్పుడు కూడా మా శక్తిని ఎలా కాపాడుకోవాలో, జట్టును ఎలా ప్రేరేపించాలో, ఏకాగ్రతతో ఎలా ఉండాలో మా కు బాగా తెలుసు. అనుభవజ్ఞులైన ప్రధాన టీ20 ఆటగాళ్లను బరిలోకి దించడం వల్ల కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించగలిగాం‘ అని సంజు శాంసన్ వివరించాడు.