13 July, 2026 | 9:49 PM

Breaking News

33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •  

ఇండియా ఆందోళన

04-12-2024 12:55 AM

అదానీ వ్యవహారంపై చర్చకు పట్టునిరసనకు టీఎంసీ, ఎస్పీ డుమ్మా

న్యూఢిల్లీ: అదానీ గ్రూపు ముడుపుల వ్యవహారం దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చించాలని ఇండియా కూటమి నేతలు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయం డిమాండ్ చేస్తూ మంగళవారం రోజు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. చర్చకు పట్టుబడితే సభను వాయిదా వేస్తూ కాలం గడుపుతున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ నిరసనలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. సభ ప్రారంభం కాగానే అదానీ వ్యవహారంపై చర్చించాలని డిమాండ్ చేశారు. 

టీఎంసీ, ఎస్పీ దూరం.. చీలికేనా?పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నేతల ఆందోళనకు టీఎంసీ,  ఎస్పీ పార్టీలు డుమ్మా కొట్టాయి. కూటమిలో చీలిక మొదలయిందనే చర్చ ఊపం దుకుంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ వంటి అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని తాము భావిస్తుంటే కాంగ్రెస్ మాత్రం అదానీ అంశం ఒక్కటే పట్టుకుందని ఆ పార్టీలు చెబుతున్నాయి. 

నేడు సంబల్‌కు రాహుల్, ప్రియాంకలోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంబల్‌కు నేడు వెళ్లనున్నారు. డిసెంబర్ 10 వరకు ఈ ప్రాంతానికి బయటి వ్యక్తులు ఎవరూ రాకూడదని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ రాహుల్ మాత్రం వెళ్లేందుకే నిర్ణయించుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు సర్వే చేస్తున్న అధికారులపై కొంత మంది దాడులు చేసి గొడవలకు కారణం అయ్యారు.

ఈ ఆంశంపై పార్లమెంట్‌లో ప్రతి రోజు వాదనలు నడుస్తూనే ఉన్నాయి. ఇందులో ఏమైనా కుట్రకోణం దాగి ఉందా అనే విషయం తెలుసుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. అక్కడ ఆంక్షలు ఉన్నా కానీ ఈ రోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు సంబల్‌లో పర్యటించడానికే నిర్ణయించుకున్నారు.

 అదానీ విషయం ఎందుకు ముఖ్యమంటే?

కాంగ్రెస్ కేవలం అదానీ వ్యవహారం మీదే ఫోకస్ చేసింది. కాం గ్రెస్‌కు అదానీ వ్యవహారం అంత ము ఖ్యమా? అనే చర్చ మొదలైంది. సామాన్యులకు అదానీ ముడుపుల వ్యవహారం పెద్దగా అవసరం వచ్చేది కాదనే అభిప్రాయాన్ని మిత్రపక్షాలతో పాటు కాంగ్రెస్ ఎంపీలు కూడా వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అదానీ వ్యవహారాన్ని మంచి అవకాశంగా కాంగ్రెస్ భావిస్తోంది. ఈ అవకాశాన్ని వదులుకోవద్దని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.