అయోధ్యలో కొనసాగుతున్నపెండింగ్ పనులు ఫొటోలు రిలీజ్ చేసిన ట్రస్ట్
లక్నో, డిసెంబర్ 3: అయోధ్య రామమందిరంలో పెండింగ్ పనులు కొనసాగుతున్నా యి. ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న సూ ర్య మందిరం, గణేశ్ మందిరం, శివ మం దిరం, దుర్గా మందిరం, అన్నపూర్ణ మందిర్, హనుమాన్ మందిరాల నిర్మాణ పనులకు సంబంధించిన ఫొటోలను రామ జన్మభూమి ట్రస్ట్ విడుదల చేసింది. ఆలయ ప్రాంగణంలో ని ప్రతి నిర్మాణాన్ని జూన్ 2025 లోపు పూర్తి చేయాలని ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.
కార్మికుల కొరత ఉన్నందున ఆలయ పనులు ్త ఆల స్యం అవుతున్నట్లు కన్‌స్ట్రక్షన్ కమిటీ చైర్మన్ న్రుపేంద్ర మిశ్రా వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన విషయం తెలి సిందే. ప్రాణప్రతిష్ట తంతు పూర్తయిన తర్వా త కూడా ఆలయ పనులు జరుగుతున్నాయి. జనవరి 22 నాడు కుర్మ ద్వాదశి ఉన్న నేపథ్యంలో జనవరి 11నే ప్రాణప్రతిష్ట మొదటి వార్షికోత్సవం జరపాలని ట్రస్ట్ నిర్ణయించింది.






