26 February, 2026 | 3:19 AM

గెలిస్తేనే నిలిచేది

26-02-2026 01:34 AM

జింబాబ్వేతో కీలక మ్యాచ్

తుది జట్టులో మార్పులు

తిలక్ ఔట్ సంజూకు ఛాన్స్

హాట్ ఫేవరెట్.. సొంతగడ్డపై మరో ప్రపంచకప్ ఖాయం.. టీ20ల్లో తిరుగులేదు.. ఇవీ వరల్ కప్‌కు ముందు భారత్ జట్టుపై వినిపించిన అంచనాలు.. గ్రూప్ స్టేజ్‌లో అదరగొట్టడంతో మరింత పెరిగాయి.. అయితే సూపర్ 8లో ఒక్క ఓటమితో బొమ్మ తిరగబడింది. ఇప్పుడు మిగిలిన రెండు మ్యాచ్ లలో గెలవాల్సిన పరిస్థితి.. జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో భారీ విజయం సాధించడమే మొదటి టాస్క్.. ఈ నేపథ్యంలో తుది జట్టులో మార్పులు కూడా ఖాయమయ్యాయి.

చెన్నై, ఫిబ్రవరి 25 : టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత జట్టు ఇప్పుడు డూ ఆర్ డై మ్యాచ్‌లు ఆడబోతోంది. సూపర్ 8 స్టేజ్ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై పరాజయం టీమిండియా సెమీఫైనల్ అవకాశాలను తీ వ్రంగా ప్రభావితం చేసింది. సెమీస్ లో అడుగుపెట్టాలంటే ఇప్పుడు మిగిలిన రెండు మ్యా చ్‌లలో భారీ విజయాలు నమోదు చేసి రన్ రేట్ మెరుగుపరుచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సఫారీలపై తక్కువ మార్జిన్ తో ఓడి పోయి ఉంటే అంత ఇబ్బంది ఉండేది కాదు. ఏకంగా 76 పరుగుల తేడాతో పరాజయం పాలవడం రన్‌రేట్‌ను బాగా దెబ్బకొట్టింది.

తాజాగా జింబాబ్వేపై వెస్టిండీస్ సాధించిన భారీ విజయంతో ఇప్పుడు భారత్ సెమీస్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారిపోయా యి. దీంతో మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిస్తేనే రేసులో నిలుస్తుంది. కాగా ప్రత్యర్థి జింబాబ్వే అయినప్పటకీ ఏమాత్రం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ జట్టు గ్రూప్ స్టేజ్‌లో ఆసీస్‌కు షాకిచ్చిన విషయాన్ని మరిచిపోకూడదు. అందుకే పూర్తిస్థా యి జట్టుతో అత్యుత్తమంగా రాణించి జిం బాబ్వేను చిత్తుగా ఓడించాల్సిందే.

ఈ క్రమంలో తుది జట్టులో మార్పులు జరగడం ఖా యమైంది. అయితే ఓపెనర్ అభిషేక్ శర్మను తప్పిస్తారని భావించినా ఓపెనింగ్ కాంబినేషన్‌ను మార్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఇషాన్ కిషన్, అభిషేక్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. అయితే వరుసగా విఫలమవుతున్న తిలక్ వర్మను తప్పిం చి సంజూ శాంసన్‌ను తీసుకుంటారని భావిస్తున్నారు. దీంతో సంజూ మూడో స్థానంలో బ్యాటింగ్ దిగే అవకాశాలున్నాయి.

మిడిలార్డర్‌లో తిలక్‌తో పాటు సూర్యకుమార్ కూ డా నిలకడలేమితో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో జింబాబ్వేపై భారత కెప్టెన్ చెలరేగితే తిరుగుండదు. అటు హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే  మెరుపులు మెరిపిస్తే భారీస్కోరు ఖా యం. ఇదిలా ఉంటే రింకూ సింగ్ ఆడడంపై సస్పెన్స్ నెలకొంది. తండ్రికి అనారోగ్యం కారణంగా జట్టును వీడిన రింకూ మళ్లీ జట్టు తో చేరాడు. బౌలింగ్ విభాగానికి సంబంధించి వాషింగ్టన్ సుందర్‌ను తప్పిం చనుండగా.. అక్షర్ పటేల్ తుది జట్టులోకి రానున్నాడు.  గత మ్యాచ్‌లో అక్షర్‌ను పక్కన పెట్టడంపై విమర్శలు కూడా వచ్చాయి.

అటు పేస్ విభాగంలో బుమ్రాతో పాటు అర్షదీప్ సింగ్ కొనసాగనున్నారు. మరోవైపు జింబాబ్వే జట్టుపై ఎటువంటి అంచ నాలు లేకపోవడంతో ఒత్తిడి కూడా కనిపించడం లేదు. దీంతో ఆ జట్టు స్వేఛ్చగా ఆడేం దుకు వీలుంటుంది. లీగ్ స్టేజ్‌లో కంగారూలకు దిమ్మతిరిగే షాకిచ్చిన జింబాబ్వే సూప ర్ 8 చేరుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. సంచలన ప్రదర్శనలతో మాత్రం అదరగొట్టింది. ఇప్పుడు ఇండియాకు కూడా హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో భారత్ ఎలాంటి అలసత్వం చూపకుండా జింబాబ్వేను ఓడించాల్సిందే.

పిచ్ రిపోర్ట్

చెన్నై పిచ్ సహజంగా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లకు కాస్త బౌన్స్‌తో సహకరించినా క్రీజులో కాసేపు కుదురుకుంటే మాత్రం బ్యాటర్లు పండగ చేసుకో వచ్చు. దీని ప్రకారం చూస్తే భారీ స్కోర్లు నమోదయ్యేందుకు అవకాశముంది.

తుది జట్లు అంచనా

భారత్ : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ (కెప్టెన్), పాండ్యా, దూబే, రింకూ/తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్, బుమ్రా

జింబాబ్వే : బెన్నెట్, మరుమని, ర్యాన్ బర్ల్, సికిందర్ రజా(కెప్టెన్), తశింగ, ము న్యాంగ, డియోన్ మేయర్స్, ముజర్బానీ, రిచర్డ్ నగర్వ, బ్రాడ్ ఎవాన్స్, గ్రేమ్ క్రీమర్