జర్నలిస్ట్ రాఘవేంద్రపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
* తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన పాపన్నపేట జర్నలిస్టులు
పాపన్నపేట: నార్సింగ్ మండలం మన తెలంగాణ దినపత్రిక విలేకరి రాఘవేందర్‌పై సోమవారం జరిగిన దాడిని పాపన్నపేట మండల విలేకరులు తీవ్రంగా ఖండిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం తహసిల్దార్ సతీష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో మీడియా ప్రతినిధులపై దాడులు ఆందోళనకరమని, జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్తల సేకరణలో నిమగ్నమై ఉన్న విలేకరులపై దాడులు జరగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, బాధ్యులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులు నిర్భయంగా విధులు నిర్వహించేలా ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.






