23 June, 2026 | 6:26 PM

ఖరీఫ్ సాగుకు విత్తన మేళా..

23-06-2026 05:28 PM

ఈ నెల 30 వరకు కొనసాగింపు

నంగునూరు: ఖరీఫ్ సాగుకు రైతులను సన్నద్ధం చేసేందుకు మండలంలోని పలు రైతు వేదికల్లో మంగళవారం విత్తన మేళా నిర్వహించారు. ఆంక్షాపూర్, గట్లమల్యాల, బద్దిపడగ, ఖాతా, నంగునూరు, నర్మెట్ట, పాలమాకుల,వెంకటపూర్ గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ... ప్రభుత్వం సూచించిన ఏడు రకాల నాణ్యమైన సన్న వరి విత్తనాల ఎంపిక,పంటల నమోదు, సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. గ్రామస్థాయిలో విత్తన లభ్యతను పెంచేందుకు ఏర్పాటు చేసిన ఈ మేళా ఈ నెల 30 వరకు కొనసాగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.