భారత్‌కు తొలి డెంగ్యూ వ్యాక్సిన్
- ‘క్యూడెంగా’కి డీసీజీఐ ఆమోదం
- జపాన్‌కు చెందిన టకేటా కంపెనీ తయారీ
న్యూఢిల్లీ, జూలై 20 : డెంగ్యూను నివారించే తొలి వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదం తెలిపిం ది. జపాన్‌కు చెందిన టకేడా బయోఫార్మా సూటికల్స్ కంపెనీ తయారు చేసిన ‘క్యూడెం గా’ వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నాలు గు నుంచి 60 ఏళ్ల వయస్సు వారు ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. క్యూడెంగా (టీఏకే-003) ను జపాన్‌కు చెందిన ఔషధ సంస్థ టకెడా అభివృద్ధి చేసింది. ఇది లైవ్ అటెన్యుయేటెడ్ టెట్రావాలెంట్ వ్యాక్సిన్. అంటే డెంగ్యూ వైరస్‌లోని నాలుగు రకాలైన డెన్వీ-1, డెన్వీ-2, డెన్వీ-3, డెన్వీ-4పై రోగనిరోధక శక్తిని పెంచేలా రూపొందించారు. ఈ వ్యాక్సిన్‌ను 0.5 ఎంఎల్ చొప్పున మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా ఇస్తారు.
డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేసిన ఈ వ్యాక్సిన్ ఇప్పటికే ఆసియాలోని 43 దేశాల్లో ఆమోదం పొందింది. భారత్‌లో ఏటా వేలాది మంది దోమల వల్ల వ్యాపించే డెంగ్యూ బారిన పడుతున్నారు. చాలా మంది మృతి చెందుతున్నారు. 2025 లో సుమారు లక్షకు పైగా కేసులు నమోద య్యాయి.
ప్రపంచంలో నమోదయ్యే డెంగీ కేసుల్లో మూడోవంతు భారత్‌లోనే నమోదు అవుతున్నవేళ.. ఈ వ్యాక్సిన్‌కు డీసీజీఐ ఆమోదం తెలుపడం గమనార్హం. సుమారు నాలుగున్నరేళ్ల పరిశీలనలో ఆసుపత్రిలో చేరే పరిస్థితిని 84 శాతం వరకు తగ్గించినట్లు గుర్తించారు. ప్రయోగశాల పరీక్షల్లో నిర్ధారిత డెంగ్యూ కేసులపై దాదాపు 61 శాతం రక్షణ కల్పించినట్లు వెల్లడైంది. భారత్‌లో ఈ వ్యాక్సిన్ ధరను ఇంకా ప్రకటించలేదు. అయితే హైదరాబాద్‌కు చెందిన ‘బయోలా జికల్-ఈ’తో టకెడా ఇప్పటికే ఉత్పత్తి ఒప్పం దం కుదుర్చుకుంది. ఏడాదికి ఐదు కోట్ల డోసుల తయారీ లక్ష్యంగా పెట్టుకుంది.






