21 July, 2026 | 12:29 PM

త్రిపుర డీజీపీ అనురాగ్ ఆత్మహత్య!

21-07-2026 12:25 AM
  1. సర్వీస్ గన్‌తో కాల్చుకుని బలవన్మరణం?
  2. బాధ్యతలు చేపట్టిన 14 నెలలకే ఘటన

అగర్తలా, జూలై 20 : త్రిపుర రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధన్‌ఖడ్ సోమవారం గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అగర్తలాలోని ఐపీఎస్ కార్యాలయ బా త్రూంలోనే సర్వీస్ గన్‌తో కాల్చుకుని సూసై డ్ చేసుకున్నట్లు, లేదా ఉరి వేసుకుని బల న్మరణం చెందినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టి స్తోంది. డీజీపీగా నియామకమైన 14 నెలలకే ఇలా తనువు చాలించడం తీవ్ర విషాదాన్ని నింపింది. అనురాగ్ ధన్‌ఖర్ సోమవారం అగర్తలాలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని తన కార్యాల యంలో విగ తజీవిగా కనిపించారు. ఆ ఐపీఎస్ అధికారిని గోవింద్ బల్లభ్ పంత్ ఆసుపత్రికి 12 గంటలకు తరలించారు.

అక్కడ వైద్యులు ఆయనను బతికించడానికి ప్రయత్నించి, మధ్యాహ్నం 12:48 గంటలకు మరణించినట్లు ప్రకటించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని తెలు స్తోంది. మరణానికి గల కచ్చితమైన పరిస్థితులు ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదని ము ఖ్యమంత్రి కార్యదర్శి కిరణ్ గిట్టే తెలిపారు. 1994 బ్యాచ్‌కు చెందిన ఈ త్రిపుర కేడర్ ఐపీఎస్ అధికారికి సుదీర్ఘమైన, ప్రతిష్టాత్మక మైన ట్రాక్ రికార్డు ఉంది.

గతంలో దేశాన్ని వణికిం చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎ న్‌బీ) కుంభకోణం నిందితుడు నీరవ్ మోదీ కేసును సీబీఐలో జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉండి విచారించింది ఈయనే. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి (యూఎన్) పీస్కీపింగ్ ఫోర్స్‌లో, సీఐఎస్‌ఎఫ్‌లో, 1984 యాంటీ సిఖ్ అల్లర్ల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇంతటి ఘనమైన కెరీర్ ఉన్న ఆయనను త్రి పుర ప్రభుత్వం మే 2025లో డీజీపీగా నియమించింది. ఏడాది తిరక్కుండానే తనువు చాలించారు. ధన్‌ఖడ్ కు భార్య, కుమార్తె ఉన్నారు.