27 June, 2026 | 7:29 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

భారత్ వృద్ధిరేటు 7 శాతమే

21-01-2025 12:44 AM

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటుపై మూడీస్ అంచనా

న్యూఢిల్లీ: ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీ స్ భారత్ వృద్ధిరేటు అంచనాలను తగ్గించేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024- 25)లో వృద్ధిరేటు ఏడు శాతమేనని తేల్చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) వృద్ధిరేటు 8.2శాతంతో పోలిస్తే తగ్గుముఖం పడుతుందని వ్యాఖ్యానించింది. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక ధోరణుల నేపథ్యంలో వృద్ధిరేటు అంచనాలు తగ్గిస్తున్నట్లు మూడీస్ పేర్కొంది. అలాగే, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు కొనసాగుతుందని వెల్లడించింది. 

2023-24తో పోలిస్తే తలసరి ఆదాయం 10,233 డాలర్లతో 11 శాతం పెరిగింది. ఇంతకు ముందు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7 నుంచి 6.4 శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే. 2023-24లో జీడీపీ 8.2 శాతంగా నిలిచింది.

అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వృద్ధిరేటు గణనీయంగా పతనమైంది. గత డిసెంబర్‌లో ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) సైతం భారత్ వృద్ధిరేట్ అంచనాలను సవరించింది. 2023- 24లో భారత్ వృద్ధిరేటు 6.5 శాతమేనని ఏడీబీ పేర్కొంది. పారిశ్రామిక వృద్ధి బలహీ నం, ప్రభుత్వ వ్యయం తగ్గింపు దీనికి కార ణం అని వెల్లడించింది. ఇండ్ల డిమాండ్‌పై కఠిన ద్రవ్య పరపతి విధానంతో 2025-26లో జీడీపీ 7.2 నుంచి ఏడు శాతానికి పరి మితం అవుతుందని తెలిపింది.