10 March, 2026 | 3:14 AM

టీమ్ ఆఫ్ ది టోర్నీలో భారత్ హవా

10-03-2026 01:16 AM

దుబాయ్, మార్చి 9 : టీ20 ప్రపంచకప్ 2026 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ఐసీసీ ప్రకటించింది. దీనిలో నలుగురు భారత ఆ టగాళ్లు చోటు దక్కించుకున్నారు. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్, వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్, ఐదో స్థానంలో హార్థిక్ పాండ్యా, పేస్ బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యారు. ఈ టోర్నమెంట్‌లో సంజూ శాంసన్ వరుస గా హ్యా ట్రిక్ హాఫ్ సెంచరీలు బాదాడు. మా క్‌ర్రమ్ కెప్టెన్‌గానూ ఫర్హాన్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. వీరితో పాటు విల్ జాక్స్, జాస న్ హోల్డర్, లుంగి ఎంగిడి, ఆదిల్ రషీద్, ముజర్బానీ, షాడ్లీ వాన్ షాల్క్(12వ ఆటగాడు) చోటు దక్కించుకున్నారు.