10 March, 2026 | 3:11 AM

ఏప్రిల్ 6 వరకు గడువు ఇవ్వండి

10-03-2026 01:14 AM

బాంబే హైకోర్టుకు బీసీసీఐ విజ్ఞప్తి

టీసీఏ పిటిషన్‌పై విచారణ

ముంబై, మార్చి 9: తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం పో రాడుతున్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) హెచ్‌సీఏపై దాఖలు చేసిన పిటి షన్‌ను బాంబే హైకోర్టు విచారించింది. టీసీఏతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు కలిసి తీసుకోవాలని గతంలోనే కోర్టు చెప్పినా హెచ్‌సీఏ బేఖాతరు చేస్తుండడంతో కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

దీనికి సంబంధించి గతంలో బీసీసీఐ సైతం హెచ్‌సీఏ ఇచ్చిన ఆదేశాలను కూడా గుర్తు చేసింది. ఈ వ్యవహారంపై స్పం దించాలని గతంలోనే బీసీసీఐని కోర్టు ఆదేశిం చింది. తాజా విచారణలో బీసీసీఐ  కొం త సమయం కావాలని కోరింది. హెచ్‌సీఏతో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించేం దుకు ఏప్రిల్ 6 వరకూ గడువు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. ఇక ఫిబ్రవరి 18న జరిగిన సమావేశానికి సంబంధించిన వివరాలను  జడ్జి జస్టిస్ పి.నవీన్‌రావు సీల్డ్ కవర్ లో హైకోర్టులో సమర్పించారు.