ఇవేం పిచ్‌లు ?
స్వదేశీ పిచ్‌లపై రెచ్చిపోతారు... విదేశీ వికెట్లపై చేతులెత్తేస్తారు.. ఇదీ భారత బ్యాటర్లపై ఉన్న విమర్శ.. నిజమే మన పిచ్‌లన్నీ ఫ్లాట్‌గా ఉంటూ బౌలర్లకు కష్టాలు కలిగిస్తే బ్యాటర్లు పండగ చేసుకుంటారు. అయితే వరల్డ్‌కప్‌కు ఇంకా ఏడాది కూడా సమయం లేని వేళ బ్యాటింగ్ పిచ్‌లతో సన్నద్ధమవడం ఎంత వరకూ సబబు..విండీస్‌తో వన్డే సిరీస్ తర్వాత కోచ్ గంభీరే కాదు మాజీ క్రికెటర్లు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసారు.
- బ్యాటింగ్ వికెట్లపై విమర్శలు
- ప్రపంచకప్‌కు ఇదేనా సన్నద్ధత ?
- కోచ్ గంభీర్ సైతం అసంతృప్తి
- బౌన్సీ పిచ్‌లపై ప్రాక్టీస్ లేకుంటే కష్టమే
- పేస్ పిచ్‌లతో సిరీస్‌లు ఆడాలని సూచన
న్యూఛంఢీఘర్, అక్టోబర్ 4 : వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను(ODI series against West Indies) భారత జట్టు 2 గెలి చినా కొన్ని అంశాల్లో మాత్రం లోపాలు స్పష్టంగా కనిపించాయి. పేలవమైన బౌలింగ్‌తో పాటు ఈ సిరీస్ కోసం రూపొందిం చిన పిచ్‌లపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. మూడు వన్డేల్లోనూ 300కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. గువాహటిలో అయితే రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 811 పరుగులు వచ్చాయి. ఈ పిచ్‌లపై టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ సైతం అసం తృ ప్తి వ్యక్తం చేసాడు.
నిజానికి పిచ్‌లను తమకు అనుకూలంగా రూపొందించుకోవ డం ఏ ఆతిథ్య జట్టయినా చేసేదే. అయితే వన్డే ప్రపంచకప్ లాంటి మెగాటోర్నీకి సన్నద్దమయ్యేటప్పుడు అక్కడి పిచ్‌లను దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్ ఉండాలి. 2027 వరల్డ్‌కప్‌కు ఆఫ్రికా దేశాలు ఆతిథ్యమిస్తుండగా అక్కడి పిచ్‌లు పేస్, బౌన్స్‌కు చిరునామాగా ఉంటాయి. అయితే ప్రస్తుతం విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పిచ్‌లన్నీ పూర్తిగా బ్యా టింగ్‌కే అనుకూలంగా రూపొందించారు.
బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇలాంటి పిచ్‌లతో మీరు సాధించే దేంటి అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ఫార్మాట్‌లో పరుగుల వరద వినోదాన్నిచ్చినా వన్డేలకు మాత్రం బ్యాలెన్సింగ్‌గా ఉండే పిచ్‌లు రూపొందించాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు. పైగా బౌన్స్, పేస్ కు అనుకూలించే పిచ్‌లను ఎందుకు సిద్ధం చేయడం లేదని బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు.
వచ్చే ప్రపంచకప్ ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలలోని పిచ్‌లు భారత్‌లోని ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్‌ల కంటే పూర్తి భిన్నంగా ఉంటాయి. అక్కడ పిచ్‌లలో సహజంగానే అదనపు బౌన్స్, పేస్ , స్వింగ్ ఎక్కువగా కనిపిస్తాయి. దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లోని పిచ్‌లపై ఉండే పచ్చిక ఫాస్ట్ బౌలర్లకు విపరీతంగా సహకరిస్తుంది. కేవలం ఫ్లాట్ ట్రాక్‌లపై అలవాటు పడిన బ్యాటర్లు అక్కడ అకస్మాత్తుగా వచ్చే బౌన్స్‌ను తట్టుకోవడం కష్టం.
ఈ ప్రపంచకప్ కోసం దక్షిణా ఫ్రికా పిచ్ క్యురేటర్లు సరికొత్త ఎక్సేంజబుల్ పిచ్ సిస్టమ్’ను ఐదు వేదికల్లో ప్రవేశపెడుతున్నారు. ఇది పిచ్‌లు పాడవకుండా కాపాడు తూ, వాటి సాంప్రదాయ సీమ్ ,బౌన్స్ లక్షణాలను టోర్నీ అంతటా స్థిరంగా ఉంచు తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా బ్యాటింగ్‌కు మాత్రమే అనుకూలించే పిచ్‌లపై సిరీస్లు ఆడటం సరైన సన్నాహకం కాదని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ప్రపం చకప్ సన్నాహకాలకు కనీసం 60 శాతం బ్యాటింగ్‌కు, 40 శాతం బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లను సిద్ధం చేయాలనిసూచిస్తు న్నారు. వరల్డ్‌కప్‌కు ముందు భారత్ ఆడే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి విదేశీ వన్డే సిరీస్‌లు మన బ్యాటర్లకు అసలైన సవాల్ కానున్నాయి. టీమిండియా 2027 మెగా టోర్నీలో రాణించాలంటే స్వదేశంలో ఆడే సిరీస్‌లలో కూడా కొంత బౌన్స్, పేస్ ఉండే లా పిచ్‌లను రూపొందించి ప్రాక్టీస్ చేయ డం ఎంతో అవసరమని చెబుతున్నారు.