17 April, 2026 | 11:49 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో పైరవీలు కుదరవు

04-06-2025 04:28 PM

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..

సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): చౌటుప్పల్ మండల కేంద్రంలోని దామెర గ్రామంలో సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్ మండలం, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajgopal Reddy), ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... 18 నెలల ప్రజా పాలనలోనే నియోజవర్గంలో ఇంత మంది పేదలకు ఇళ్ల నిర్మాణ పత్రాలు పంచడం సంతోషంగా ఉందన్నారు. 

గత కాంగ్రెస్ హయాంలో కట్టించిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు.నియోజక వర్గానికి 10 వేల ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఇంకా ఎంతో మంది పేదలు ఇండ్లు లేక బాధపడుతున్నారని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.గత ప్రభుత్వం లో దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వారి పార్టీ వాళ్ళకే ఇచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ  పార్టీలకతీకంగా పథకాలు అమలు చేస్తుందని అన్నారు.పైరవి కారులకు, అనర్హులకు ప్రభుత్వ పథకాలు అందినట్లయితే క్యాన్సిల్ చేసి మరి పేదవాళ్లకు అందేలా చేస్తానని తెలిపారు.ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్ల కు సరిపోవు కావున  ప్రభుత్వం దృష్టికి జిల్లా కలెక్టర్లు తీసుకు పోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా,మండల స్థాయి నాయకులు,అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.