calender_icon.png 11 June, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజమైన వికలాంగుడికి ఇల్లు లేదు

10-06-2025 01:17:13 PM

 నాకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ప్రభుత్వానికి వేడుకోలు: నారపాక లింగయ్య ఆవేదన

చండూరు,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో తన పేరు లేదని నేర్మట గ్రామస్తుడు నారపాక లింగయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఎంపిక చేయలేదు. నిజమైన వికలాంగుడు లింగయ్య కూలి పనులు చేద్దామన్న ఆయనకు ఆరోగ్యం సహకరించదు. లింగయ్య భార్య మనోహర కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తుంది. ఈయనతో పాటు కొంతమంది వికలాంగులు, వితంతువులు ఈ గ్రామంలో ఉన్నారు. ఏ ఒక్కరి కూడా ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరుపేద అయిన నారపాక లింగయ్య కు ఇల్లు కేటాయించలేదని నిరుపేదలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లింగయ్య భార్య కూలి చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.