10-06-2025 11:14:40 AM
ఇరువురికి గాయాలు... ఆస్పత్రికి తరలింపు
పెద్దపెల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి పట్టణంలో ఇంజనీరింగ్ మహిళా విద్యార్థులపై మంగళవారం లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇరువురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. లారీ దూసుకెళ్లిన ఘటనలో అదృష్టవశాత్తు విద్యార్థులు గాయాలతో బయటపడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.