ఇందిరమ్మ ఇండ్ల పనులు పూర్తి చేయాలి
కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్, అక్టోబర్ 17 : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండలంలోని గంగిపల్లి, షెట్ పల్లి గ్రామాలలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని ఎంపీడీవో సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ ఏఈ కాంసానిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభు త్వం నిరుపేదలకు అందించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బేస్ మెంట్, లెంటల్, స్లాబ్ స్థాయిల వారీగా పూర్తయిన పనులకు లబ్ధిదారుల ఖాతాలలో బిల్లులు జమ చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇసు కను ఉచితంగా అందిస్తుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని కోరారు.
ఇసుక రీచ్‌ను పరిశీలించిన కలెక్టర్
జైపూర్ మండలంలోని వేలాల గ్రామ శివారులోని గోదావరి నది తీరాన గల ఇసుక రీచ్ ప్రాంతాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఇసుకను తీయాలని, ఇందిరమ్మ పథకంలో ఇం డ్ల నిర్మాణాలకు, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ముందుగా ప్రా ధాన్యతనివ్వాలని సూచించారు. ఇసుక అక్ర మ రవాణా జరగకుండా అధికారులు చర్య లు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులున్నారు.






