15 April, 2026 | 9:33 AM

పత్తికి క్వింటాలుకు రూ.10,500, వరికి క్వింటాలుకు రూ.3,000 చెల్లించాలి

18-10-2025 12:00 AM

ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్

ఆలేరు, అక్టోబర్ 17 (విజయక్రాంతి): అఖిల భారత రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆలేరు తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా, మెమొరాండం, రైతుకు కనీస మద్దతు ధర పత్తికి క్వింటా 10,500-, వరికి క్వింటాలుకు 3,000- చెల్లించాలని మామిడాల బిక్షపతి ఏ ఐ కె ఎం ఎస్ రాష్ట్ర అద్యక్షులు అన్నారు, అనావృష్టి మూలంగా,కేంద్ర ప్రభుత్వం సకాలంలో ఎరువులు సరఫరా చేయకపోవడంతో మరియు అడవి పందులు, నెమళ్ళు, కోతుల మూలంగా పంటలు పాడైపోయాయని ఈ పరిస్థితులలో ఆ మాత్రం అయిన రైతు చేతికి వచ్చిన పత్తి పంటకు క్వింటా కు 10,500-, వరికి క్వింటాలుకు 3,000 -రూపాయలుగా నిర్ణయించి తక్షణమే అమలు చేయాలని, మార్కెట్ యార్డులో, ఐకేపీ సెంటర్లలో వరి కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయాలని, మార్కెట్ క్యార్డులలో, ఐ కే పి సెంటెర్లలో రైతు పంటలకు తగిన విధంగా సౌకర్యాలు కల్పించాలని, మధ్య దళారుల దోపిడీని అరికట్టుటకు తగిన విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అద్యక్షులు మామిడాల బిక్షపతి, అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొల్లూరి రాజయ్య, మంగ నర్సింహులు, ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు కల్లెపు అడివయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు చెక్కె వెంకటేష్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్,డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, ఏఐకెఎంఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు మామిడాల సోమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు, చిర బోయిన రాజయ్య, జిల్లా సహాయ కార్యదర్శి పిన్నపు రెడ్డి రాఘవ రెడ్డి, జిల్లా కోశాధికారి బర్మ బాబు, ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్, జిల్లా నాయకులు అన్ రెడ్డి బాల్ రెడ్డి, చిరబోయిన కొమరయ్య, మామిడాల బాల మల్లేష్, టంగుటూరు మాజీ సర్పంచ్ కట్టా సమరసింహారెడ్డి, ఇక్కిరి శ్రీనివాస్, మారుజోడు సిద్దేశ్వర్, గడ్డం మంకయ్య, చిరబోయిన బాలయ్య, తమ్మడి అంజయ్య, సుంచు రాములు పాల్గొన్నారు.