calender_icon.png 9 June, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కార్ బడిలో సకల సదుపాయాలు

09-06-2025 04:58:56 PM

నిర్మల్ (విజయక్రాంతి): సర్కారు బడి(Government school)లో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించడం జరిగిందని ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు తుకారం ఉపాధ్యాయులు పి గజ్జరం అన్నారు. సోమవారం మామడ మండలంలోని పరిమండల్ లక్ష్మణ చందా మండలంలోని వడ్డాల్ తండా గ్రామాల్లో బడిబాట కింద ప్రచార నిర్వహించి గిరిజన పిల్లలను తమ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. గిరిజన ఆశ్రమ పాఠశాల పిల్లలకు నాణ్యమైన భోజనం విద్య ఆటలు స్వయంకృతి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీలత దూప్ సింగ్ శకుంతల స్మిత పాల్గొన్నారు