11 July, 2026 | 8:34 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

23-06-2025 10:03 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..

హనుమకొండ (విజయక్రాంతి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళను రాజకీయాలకు అతీతంగా మంజూరు చేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ 59వ డివిజన్లోని అలిపురలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నిర్మాణ పనులకు భూమి పూజ చేసి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఆత్మగౌరవానికి బలమైన పునాది వేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం 20 లక్షల ఇళ్లను నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, 59 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేతిడి దీపక్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పూరెల్ల రవి కిరణ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తేల సుగుణ కిషోర్, రజిత, ఎండి మజర్ అహ్మద్, ఎండి నబీన్, అమిత్ కుమార్, దొంగరి శ్రీనివాస్, కోన శ్రీకర్, మదర్ తదితరులు పాల్గొన్నారు.

వడ్డేపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల సంబురాలు.

గ్రేటర్ వరంగల్ 60 వ డివిజన్ వడ్డేపల్లిలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఇండ్లకు స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్(Corporator Dasyam Abhinav Bhaskar) భూమి పూజ చేసి ప్రారంభించారు. బుస కవిత, బస్కూరి వన, బత్తిని శారద, బస్కూరి చైతన్య తదితర లబ్ధిదారుల ఇళ్లకు భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎనుకుంటి నాగరాజు, 60 డివిజన్ అధ్యక్షుడు ఎనుకుంటి పున్నం చందర్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు బుస్సా నవీన్ కుమార్, మట్టపల్లి కమల్ కుమార్, బిజెపి శ్రేణులు నాగపురి అశోక్, రోకుల సతీష్, మట్టపల్లి రామ్ రాజ్, కటకం యాదగిరి, హౌసింగ్ ఏఈ అడ్లూరి నరేంద్ర రాజ్ తదితరులు పాల్గొన్నారు.