08-01-2026 01:39:16 AM
రూ.40లక్షల విలువైన ఆభరణాలు అపహరణ
కూకట్‌పల్లి, జనవరి ౭ (విజయక్రాంతి): కేపీహెచ్‌బీ పీఎస్ పరిధి సర్దార్ పటేల్ నగర్‌లోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. గత రాత్రి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు స్కూటీపై వచ్చి ఆలయ వెనుక గేటు ద్వారా లోపలికి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దాదాపు 13 కిలోల వెండి, మూర్తులపై ఉన్న బంగారంతో కలిపి సుమారు 40 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు చోరీ అయినట్లు ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు.