19 March, 2026 | 3:32 AM

‘ఇందిరమ్మ ఇండ్లు’ నిరంతర ప్రక్రియ

19-03-2026 01:59 AM
  1. ఏప్రిల్, మే నెలల్లో రెండో విడత

త్వరలోనే జర్నలిస్టుకు ఇండ్ల స్థలాలు

శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రెండో విడత ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. రాబో యే ౩ సంవత్సరాలలో పట్టణ ప్రాంతాలల్లోని ప్రతీ వార్డుకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామన్నారు.

శాసన మండలిలో బుధవారం సభ్యులు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, మధుసూదనా చారి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. గిరిజన తండాలు, గూడాల్లో గతంలో ప్రారంభమై వివిధ స్థాయిలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. జూన్ నాటికి మొద టి విడతలో మంజూరైన మూడు లక్షల ఇందిరమ్మ ఇండ్లు మెజారిటీ పూర్తి అవుతాయని చెప్పారు. ,

డబుల్ బెడ్రూమ్ పథకంలో పెండింగ్ బిల్లులు 99 శాతం  ఇప్పటికే చెల్లించామన్నారు. మిగిలినవాటిని కూడా త్వరలో క్లియర్ చేస్తామన్నారు. వచ్చే రెండు, మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకురాబోతున్నామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.

జర్నలిస్టుల సమస్యలపై తక్కెళ్లపల్లి రవీందర్ రావు, తీన్మార్ మల్లన్న అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చా రు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, కోర్టు పరిధిలో ఇబ్బందులు లేకుండా ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్ కార్డులు జారీచేస్తామన్నారు.