calender_icon.png 19 January, 2026 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తా

19-01-2026 02:48:54 PM

ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు

బెజ్జూర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్ ఏరియాలో వార్డు నెంబర్ -1 ,2,3,16  ఓల్డ్ కాలనీలోని వార్డు నెంబర్ - 15 ల్లో 47 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ గృహ నిర్మాణం పథకాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని, వెనువెంటనే పనులు మొదలుపెట్టి వర్షాకాలంలోపు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపారు. వార్డుల్లో సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు.