calender_icon.png 19 January, 2026 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో పచ్చదనం కోసం నర్సరీలు తప్పనిసరి

19-01-2026 02:50:27 PM

సర్పంచులు తప్పట్ల ఎల్లయ్య, చింతకుంట్ల మనోజ్

తుంగతుర్తి:  పచ్చదనాన్ని పెంపొందించడానికి ఏటా గ్రామాల్లో ప్రభుత్వం హరితహారం చేపడుతోంది. ఇందులో భాగంగా  గ్రామపంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కల పెంపకానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా కూలీలకు పని కల్పిస్తూ, నర్సరీ పనులను వేగవంతం చేశారు. దీనితో రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు అన్నారు. మండల పరిధిలోని వెంపటి, రావులపల్లి గ్రామాలలో సోమవారం సర్పంచులు తప్పట్ల ఎల్లయ్య, చింతకుంట్ల మనోజ్ నర్సిల ఏర్పాటుకు అధికారులతో కలిసి, ముగ్గు పోసి ప్రారంభించారు.