25 March, 2026 | 10:07 AM

అరులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు

18-03-2025 12:04 AM

మునిపల్లి, మార్చి 17: అరులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాయి కోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని  ఇబ్రహీం పూర్ గ్రామంలో  ఇందిరమ్మ  ఇళ్ల నిర్మాణానికి  శంకుస్థాపన,   సీసీ  రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.  అర్హులందరికి ఇండ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ హారినందన్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పిల్లోడి సతీష్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు  రాజు,  మాజీ ఎంపీటీసీలు  బుర్కల పాండు,  బాబు పాటిల్ , రహీం, నాయకులు  సంగన్న, ఇబ్రహీంపూర్ గ్రామ అధ్యక్షుడు  ఫేక్ అలీ,  నాయకులు  అశోక్,  ప్రేమ్,  రుద్ర కృష్ణ  తదితరులు పాల్గొన్నారు.