వరద కాలువతో రైతన్న ఇంట సిరులు!
- శరవేగంగా హుస్నాబాద్ వరద కాలువ పనులు
- మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితోనే..
- కాంగ్రెస్ నేత కొలుగూరి రాజు
భీమదేవరపల్లి, మార్చి 15 (విజయక్రాంతి): మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో హుస్నాబాద్ వరద కాలువ పనులు శరవేగంగా సాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొలుగూరి రాజు పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండ లం ముల్కనూరులో మీడియాతో మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్ట్ వరద కాలువ ప్రగ తి వేగం పెంచడానికి శక్తి వంచన లేకుండా ప్రభుత్వం ద్వారా న్యాయపరమైనటువంటి చిక్కులను, ఆర్థికపరమైన అడ్డంకులను అధిగమిస్తూ పరిపాలన అనుమతుల్లో ఎలాంటి అవరోధాలు లేకుండా లక్ష 6 వేల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా మంత్రి కృషి చేస్తున్నారని అన్నారు.
భూ నిర్వాసితులకు నష్టపరిహారాన్ని అందించే దిశగా బీడు భూములను పంటలు పండించే మాగానిగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నిమగ్నమైందన్నారు. కాకతీయ కాలువనే కాదు వరద కాలువ ద్వారా కోహెడ, చిగురు మామిడి, అక్కన్నపేట, హుస్నాబాద్, భీమదేవరపల్లి, సైదాపూర్, ఎల్కతుర్తి గ్రామాల రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు.




