1 August, 2026 | 1:06 AM

రామగిరి 250 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కు

01-08-2026 12:00 AM

త్వరలో బహుళజాతి పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

ఖిల్లా రహదారి పనులపైనా దృష్టి.. పర్యటనకు అధికారుల ఏర్పాట్లు

రామగిరి, జూలై 31 (విజయక్రాంతి): రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని రామగిరి  ప్రాంతం లో ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటనకు రంగం సిద్ధమైంది. త్వరలో మేడిపల్లి శివారులోని రామగిరి ప్రాంతంలో ఇండస్ట్రీయల్ పార్క్ కు కేటాయించిన భూములను ఆయన పరిశీలించనున్నారు.

గ్రామ పంచాయతీ పరిధిలోని మేడిపల్లి ప్రాంతంలో సుమారు 250 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలు, ఇండస్ట్రియల్ పార్కు సంబంధించిన పనులను మంత్రి పరిశీలించనున్నారు. ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి స్థల పరిస్థితులు, మౌలిక వసతులు, అభివృద్ధి పను లపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో అధికారులతో మంత్రి సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రత్నాపూర్ గ్రామం నుంచి చ్‌ంచి ప్రాంతానికి వెళ్లే రహదారి పనుల పురోగతిని కూడా మంత్రి పరిశీలించనున్నారు.

మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు శుక్రవారం ఇండస్ట్రియల్ పార్క్ ప్రాంతంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక సర్పంచ్ పల్లె ప్రతిమ ఆధ్వర్యంలో పరిశ్రమలు ఏర్పాటు చేయనున్న ప్రాంతంలో చదును చేసే  పనులు చేపట్టారు.ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు ద్వారా రత్నాపూర్, రామగిరి మండలంతో పా టు పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని స్థానికులు భావిస్తున్నారు.

పరిశ్రమలు అందుబాటులో కి వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో సంబంధిత శాఖల అధి కారులు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేశారు.సర్పంచ్ పల్లె ప్రతిమపివీరావు, తహసీల్దార్ పర్నంది సుమన్, ఎంపిడీఓ బద్రి శైలజ రాణి,ఎంపీఓ మూల సమ్మిరెడ్డి, విద్యుత్ ఏడిఈ వంగల వెంకటనారాయణ, సబ్ ఇంజినీర్ కుమ్మరికుంట సతీష్, ఆర్.ఐ కే. మహేష్, ఇండస్ట్రీయల్ జే.ఈ సృజన్, కాంట్రాక్టర్ నిశాంత్, సెక్రటరీ గంగుల సంతోష్,జీపీఓ పెరుకు.వెంకటేశ్వర్లు, విద్యు త్ లైన్ మెన్ బంగారు శివ కుమార్, గుండా చందన్ పాల్గొన్నారు.