29 July, 2026 | 2:33 AM

‘ఐఎన్‌ఈడబ్ల్యూ’ తొలి చాప్టర్

29-07-2026 01:19 AM

 హైదరాబాద్‌లో ప్రారంభం

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ది లీలా హోటల్‌లో ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ ఆఫ్ ఎలైట్ ఉమెన్ (ఐఎన్‌ఈడబ్ల్యూ) తొలి భారతీయ అధికారిక చాప్టర్‌ను ప్రారంభించారు. మహిళల నాయకత్వం, గ్లోబల్ సహకారం, వ్యాపార అవకాశాలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ వేదికను డా. మోనికా గార్గ్ స్థాపించారు. హైదరాబాద్ చాప్టర్‌కు డా. ఉషా యనమంద్ర అధ్యక్షురాలిగా, సుఖీ గాంధీ సహాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో డా. పద్మ వీరపనేని, డా. మౌనికా రెడ్డి, గురుప్రియా కోహ్లీతో పాటు పారిశ్రామిక, వైద్య, విద్యా, ప్రజాసేవ రంగాలకు చెందిన పలువురు ప్రముఖ మహిళలు పాల్గొన్నారు. “కనెక్ట్.. కొలాబొరేట్.. రైజ్‌” అనే సిద్ధాంతంతో మహిళలను అంతర్జాతీయ అవకాశాలతో అనుసంధానించడమే ఐఎన్‌ఈడబ్ల్యూ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.