వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి
వనస్థలిపురం ప్రభుత్వాస్పత్రిలో ఘటన
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఓ పసికందు మృత్యువుకు కారణమైంది. ఈ అమానవీయ ఘటన వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌కు చెందిన శిరీష దంపతులు ప్రసవం కోసం వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఈ క్రమంలో వైద్యులు శిరీషను డెలివరీ చేసేందుకు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. అయితే, డెలివరీ అనంతరం కట్ చేయాల్సిన శిశువు బొడ్డుపేగును ముందుగానే కట్ చేయడంతో ఉమ్మనీరు మింగి సర్జరీ జరుగుతుండగానే శిశువు ప్రాణాలు విడిచింది.
దీంతో ఏం చేయాలో తెలియక, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని వైద్యులు కుటుంబీకులకు తెలిపారు. అదేవిధంగా సర్జరీ సమయంలో ఉమ్మ నీరు ఎక్కువై బిడ్డ చనిపోయిందం టూ బుకాయించారు. ఈ పరిణామంతో ఆగ్రహానికి గురైన కుటుం బీకులు, బంధువులు పసికందు మృ తికికారణమైన వైద్యులపై చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళ నకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




