31 March, 2026 | 3:51 AM

రైతుల సమస్యలపై పోరాటం చేశాం

16-05-2024 01:23 AM

రాయలతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్

ఆయన మృతిపై సంతాపం

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెం కటశేషగిరిరా వు మరణం పట్ల ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారితో దశాబ్దకాలంగా తనకు ఉన్న రాజకీయ అనుబంధం, పలు పదవుల ద్వారా రైతాంగం కోసం, ప్రజల కోసం, పార్టీ కోసం శేషగిరిరావు చేసిన కృషి గుర్తు చేసుకున్నారు. శోకతప్తులైన వారి కుటుంబసభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.