15 March, 2026 | 10:54 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

ఇన్ఫోసిస్ 32 వేల కోట్ల జీఎస్టీ ఎగవేత!

02-08-2024 01:00 AM

షోకాజ్ నోటీసు జారీ చేసిన కౌన్సిల్

న్యూఢిల్లీ, జూలై 31: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ భారీ స్థాయిలో జీఎస్టీని ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తున్నది. రూ.32,403 కోట్ల జీఎస్టీ ఎగవేతకు సంబంధించి ముందస్తు షో-కాజ్ నోటీసు జారీ అయినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. జూలై 2017 నుంచి మార్చి 2022 వరకు రూ.32 వేల కోట్ల జీఎస్టీ చెల్లింపులు జరుపలేదని కర్ణాటక స్టేట్ జీఎస్టీ ఆథార్టీ ఈ నోటీసును జారీ చేసినట్లు సంస్థ వెల్లడించింది. కంపెనీకి సంబంధించి విదేశీ కార్యాలయాలు పెట్టే ఖర్చులపై జీఎస్టీ చెల్లించలేకపోవడంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిటెన్స్ ఈ ముందస్తు షోకాజ్ నోటీసును జారీ చేశారు.