హరీశ్‌రావు క్షుద్రపూజలు
06-08-2026 12:41 AM
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్
నిజామాబాద్, ఆగస్టు 5 (విజయక్రాం తి): తమిళనాడు, కర్ణాటకలో మాజీ మంత్రి హరీశ్‌రావు క్షుద్రపూజలు చేశారో లేదో వివ రణ ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ డిమాండ్ చేశారు. నిజామా బాద్ నగరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తమిళనాడులో హరీశ్‌రావు ఎందుకు పర్యటించారు? తమిళ నాడు పేరు వినగానే హరీ శ్‌రావు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో వివరి ంచాలని డిమాండ్ చేశారు. క్షుద్ర పూజలు చేశారనే సమాచారం ఉన్నదని అన్నందుకు నాతో పాటు తమ పార్టీ నేతలకు లీగల్ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. క్షుద్ర పూజలకు ప్రసిద్ధి చెందిన దేవాలయాల సందర్శన వెనక మర్మం ఏమిటో హరీష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసులపై సమాధానం చెపుతానని అన్నారు.






