మౌలిక సదుపాయాలు కల్పించాలి
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): రెండవ పురపాలక సంఘం సాధారణ ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం తిరుమలగిరి ఎంపీడీవో కార్యాల యంలో జిల్లా ఎస్పీ కె.నరసింహతో కలిసి బిఎల్‌ఓ, ఆర్ ఓ, ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, జోనల్ ఆఫీసర్ లతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులకు అవగాహన మరియు పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు కల్పించవలసిన మౌలి క సదుపాయాల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించు ప్రతి అధికారి ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటిస్తూ, ఎన్నికల కమిషన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి, ఓటర్లకు లైట్లు, ఫ్యాన్లు, కుర్చీలు, టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో సీసీ కెమెరాలతో మానిటరింగ్ ఏర్పాటు చేయాలని, ప్రతి పోలింగ్ స్టేషన్లో వికలాంగులు, వయో వృద్ధులు, నడవలేని వారికి వీల్ చైర్ ఏర్పాటు చేయాలని, ఓటింగ్ కంపార్ట్మెంట్లో వెలుతురు సరిగా ఉండే విధంగా లైట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.
పోలింగ్ ప్రదేశంలో 100 మీటర్ల డిస్టెన్స్ పాటించాలని మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులకు అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధ నలు వివరించాలని అన్నారు. అనంతరం తిరుమలగిరిలో పోలింగ్ స్టేషనులను, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ సంద ర్శించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డిఓ వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ సంపత్, తహసిల్దార్ హరికృష్ణ పాల్గొన్నారు.




