1 March, 2026 | 3:37 AM

స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్‌లో ఇంజీనియస్ వేడుకలు

01-03-2026 12:00 AM

డాక్టర్ సునీల్‌కుమార్ జంగాల చేతుల మీదుగా నేషనల్ సైన్స్‌డే ప్రారంభోత్సవం

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): స్థానిక శ్రీనగర్‌లోని స్టేమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్‌లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం ఇంజీనియస్-2026 వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ సునీల్‌కు మార్ జంగాల ఎండీ,డీఎం గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్(గోల్డ్‌మెడలిస్ట్), స్కూల్ డైరక్టర్ కొండా శ్రీధర్ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి సునీల్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశనుంచే సైన్స్ పట్ల అవగాహన కలిగి నూ తన ఆవిష్కరణలకు సిద్ధం కావాలన్నారు. 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్భంగా నేషనల్ సైన్స్‌డేగా జరు పుకుంటున్నామన్నారు. 1930లో సర్ సీవీ రామన్ భౌతికశాస్త్రంలో రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు నోబెల్ బహుమతి పొందారన్నా రు. ప్రతి విద్యార్ధి అంకితభావం, కమశిక్షణ కలిగి ఓటమికి కుంగిపోకుండా విజయాలను సాధించాలన్నారు.

విద్యార్ధులు చేసిన సైన్స్ పాజెక్టులు వారి ఆలోచనలు పదర్శనకు మా త్రమే కాకుండా ఉపయోగంలోకి వచ్చేలాగా పయత్నించాలని ఆకాంక్షించారు. స్టేమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్‌లో శ్రీనగర్ విద్యా ర్థులకు విజ్ఞానశాస్త్త్ర ఆవిష్కరణలకు గొప్ప వేదికను అందించిందన్నారు. డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు మాట్లాడుతూ సైన్స్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో కీలకమైనదని, విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు ఆలోచింపజేస్తూ ప్రయోగాత్మకంగా రుజువుచేయుటకు స్టేమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్‌లో శ్రీనగర్ ప్రోత్సా హన్ని అందిస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,ఉపాధ్యేయేతర సిబ్బంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.