1 March, 2026 | 5:28 AM

కొండగట్టు ఆలయ ఈవో బదిలీ

01-03-2026 12:00 AM

ఈవో వర్సెస్ అర్చకుల వివాదమే కారణం!

జగిత్యాల, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ ఈవో శ్రీకాంత్‌రావ్‌ను మహబూబ్ నగర్ జిల్లా మాన్యంకొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆలయానికి బదిలీ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశా రు. హైదరాబాద్ పెద్దమ్మతల్లి దేవాలయ ఈవో శ్రీనివాసరాజుకు కొండగట్టు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈవో వ్యవహారశైలిపై ఇటీవల మంత్రి అడ్లూరికి అర్చకులు ఫిర్యాదు చేశారు. అనంతరం  19 మంది అర్చకులకు ఈవో శ్రీకాంత్ రావ్ నోటీసులు ఇచ్చారు. ఈవో వర్సెస్ అర్చకుల వివాదం లో ఆకస్మిక బదిలీపై చర్చ కొనసాగుతుంది.