17 April, 2026 | 11:01 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

అనుమానాస్పద స్థితిలో శిశువు మృతి

01-03-2026 12:00 AM

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మం డలం పాలెం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల బాలుడు నీటి తొట్టిలో అనుమానాస్ప ద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య విభేదాల నేపథ్యంలో బాలుడి తల్లి నీలమ్ పుట్టింటి వద్ద ఉంటోంది.

ఈ క్రమంలో మాట్లాడేందుకు భర్త కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి పాలెం గ్రామానికి వచ్చినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో బాలుడికి పాలు ఇవ్వడానికి చూసుకున్న తల్లికి బాబు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఇంటి పరిసరాల్లో వెతకగా నీటి తొట్టిలో బాలుడి మృతదేహం లభ్యమైంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని నాగర్ కర్నూల్  ఆసుపత్రికి తరలించారు.