15 August, 2026 | 12:57 AM

పీఎంశ్రీ నిధుల దుర్వినియోగంపై విచారణ

15-08-2026 12:20 AM

 చేవెళ్ల ఆగస్టు 14 (విజయ క్రాంతి): చేవెళ్ల ఆదర్శ పాఠశాలలో పీఎం శ్రీ నిధులు దుర్వినియోగం పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో ఎంఈఓ పురం దాసు బృందం తనిఖీ చేసింది. తనిఖీలో భాగంగా రికార్డులను,రిజిస్టర్ లను, నిధుల ఖర్చుకు సంబందించిన బిల్లుల తనిఖీ చేశారు. పూర్తి నివేదిక ఉన్నతాధికారులకు పంపిస్తామని ఎంఈఓ చెప్పారు. అవకతవకలు జరిగినట్లు రుజువు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.