15 August, 2026 | 1:14 AM

కామారెడ్డి 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, పలువురికి తీవ్ర గాయాలు

15-08-2026 12:21 AM

కామారెడ్డి, ఆగస్టు 14 (విజయక్రాంతి): కామారెడ్డి 44 వ జాతీయ రహదారి పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళ్తున్న ప్రయాణికులు అదుపు తప్పి కారు బోల్తాపడడంతో కారులో ప్రయాణి స్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదంలో నిర్మల్ మండలం సారంగా పూర్ కు చెందిన సారంగాపూర్ మండలంలోని అడవి తండా చెందిన పరశురాములు, దేవిదాస్, రాజేష్, బాలాజీ, రోహిణి తండా చెందిన ప్రతిభ తో పాటు ఇద్దరు చిన్నారులు  శివాన్సి, రియాన్సీ కారులో ప్రయాణం చేస్తున్నారు.

కామారెడ్డి శివారులో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి పట్టణ పోలీసులు చేరుకొని క్షత గాత్రుల కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.