తాగునీటి క్యాంపుల పరిశీలన
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8(విజయక్రాంతి): ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా హుస్సేన్ సాగర్ ట్యాంక్‌బండ్‌పై జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాగునీటి క్యాంపులను ఈడీ మయాంక్ మిట్టల్‌తో కలిసి ఆ సంస్థ ఎండీ అశోక్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, పీపుల్స్ ప్లాజా, పరిసరాల్లో 40 శిబిరాలను ఏర్పాటు చేసి తాగునీటి వసతి కల్పించామని, ప్రజల తాకిడి దృష్ట్యా మరో 5 శిబిరాలను అదనంగా ఏర్పాటు చేశామన్నారు. రెండు రోజుల్లో 6లక్షల మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. మరో 3లక్షల ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్ అమరేందర్‌రెడ్డి, సీజీఎం ప్రభు, జీఎంలు బ్రిజేశ్, దామోదర్‌రెడ్డి, జాన్‌షరీఫ్, హరిశంకర్, ప్రభాకర్, వినోద్, సాయిరమణ పాల్గొన్నారు.
21 ఉచిత వైద్య శిబిరాలు
ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, పీపుల్‌ప్లాజా, సెక్రటేరియట్, అంబేడ్కర్ విగ్రహం వద్ద 21 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఆదివారం ఈ వైద్య శిబిరాలను కుటుంబ ఆరోగ్య శాఖ కమిషనర్ ఆర్‌వీ కరణ్, డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్ సందర్శించారు. అందుతున్న సేవలు, మందులు, వివరాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. కాగా ఈ వైద్య శిబిరాల్లో 125 మంది పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.






