హిందూ ధర్మ పరిరక్షణ సమితి ర్యాలీ
09-12-2024 01:14 AM
భీమదేవరపల్లి, డిసెంబరు 8: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో హిందు ధర్మ పరిరక్షణ కమిటీ సభ్యులు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ ర్యాలీ నిర్వహించారు. ముల్కనూర్ జిల్లా పరిషత్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. హిందువులపై దాడులను నిలిపివేయాలని కమిటీ సభ్యు లు నినాదాలు చేశారు.
సన్యాసి చిన్మయిని ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశా రు. ర్యాలీలో కమిటీ సభ్యులు రమణ, శ్రీధర్, రాంబాబు, కొంరయ్య, మురళీకృష్ణ, శ్రీనివాస్, త్రిజ్ఞానేష్, ధర్మన్న, గుడికందుల అక్షయ్, అయిత సాయి, బత్తిని రాంబాబు, దొంగల రణధీర్, సుద్దాల జవహర్, గౌడ బాలాజీ, రాహుల్ పాల్గొన్నారు.






