14 April, 2026 | 4:19 AM

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

14-04-2026 01:43 AM

నిజాంసాగర్ ఏప్రిల్ 13 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్  విక్టర్, పరిశీలించారు. ఎప్పటికప్పుడు ధాన్యం వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తూకం వేయాలని ఆయన సూచించారు.

కొనుగోలు కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం నీడ వసతి తప్పకుండా ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా అయన అధికారులకు సూచించారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం ద్వారానే విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఆయన ఈ సందర్భంగా రైతులను కోరారు. ఆయన వెంట స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిలు, తదితరులు ఉన్నారు.