ఇంటర్ ఫలితాల్లో స్టెమ్‌స్పార్క్ విద్యార్థుల హవా
హైదరాబాద్, ఏప్రిల్ 13(విజయక్రాంతి): స్థానిక శ్రీనగర్ కాలనీలోని స్టెమ్‌స్పార్క్ జూ నియర్ కాలేజ్ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో విజయ పరంపరను కొనసాగిస్తూ అత్యద్బుత ప్రతిభను కనబరిచి అత్యధిక మార్కులతో విజయ ధుందుబి మ్రోగించారు.
ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు సాధనే లక్ష్యంగా స్థాపించిన స్టెమ్‌స్పార్క్ జూనియర్ కాలేజ్ శ్రీనగర్ నందు ఇంటర్ జూనియర్ ఫలితాలలో విద్యార్థులు బి.ప్రతిభ (467/470), పి.శ్రావ్య (467/ 470), పీయల్ శరత్ చంద్ర (467/470), జి.గణేష్(467/470), కె.గాయత్రి తన్విష(46౬/470),డి.అఖిల్ (46౬/470), సీహెచ్ హాసిని(46౬/470), జి.ధనుష్‌కుమార్(46౬/470), .అనీష్‌రెడ్డి(46౬/470), షేక్ మహమ్మద్ అసివ్(46౬/470), బి.విశాలక్షి(46౬/470) మార్కులు సాధించి 460పైగా 36,450పైగా 57, 400పైగా 93 విద్యార్థులు తిరుగులేని ఫలితాలతో విజయధుంధుభి మ్రోగించారు.
సీనియర్ ఇంటర్ ఫలితాల్లో వై.అక్షిత(992/1000), ఎ.భానుతేజ(9౮౯/1000), సీహెచ్‌వీ సాయి పవన్ (9౮౯/1000), సీహెచ్ గాయత్రి (987/ 1000), సీహెచ్ హిమజ(986/1000) మార్కులు సాధించి విజయానికి చిరునామాగా నిలిచిన స్టెమ్‌స్పార్క్ విద్యార్థులను కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృం దం అభినందించి ఆశీర్వదించింది.
ఈ అభినందన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కొం డా శ్రీధర్‌రావు మాట్లాడుతూ ‘పోటీ పరీక్షలలో విజయమే లక్ష్యంగా’ కళాశాలను స్థా పించి సామాన్య విద్యార్థులతో కూడా అసామాన్య ఫలితాలను సాధించగలిగేలా కృషి చేస్తున్నామని, వారికి భవిష్యత్తులో జరగబో యే మెయిన్స్, అడ్వాన్స్, యం.సెట్. వంటి పోటీ పరీక్షలలో ఉత్తమ ప్రతిభన కనబరచి, ఐఐటీ, యన్‌ఐటీ సీట్లను సాధించి తల్లిదండ్రుల ఆశయాలను సాధించడానికి స్టెమ్‌స్పా ర్క్ జూనియర్ కాలేజ్ శ్రీనగర్ ప్రణాళిక బద్దంగా విద్యాబోధన చేస్తుందని తెలియజే స్తూ అత్యుత్తమ మార్కులు సాధించి అది ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు.
పాఠశాల డైరెక్టర్ కొండా కృష్ణవేణి మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరచిన స్టెమ్‌స్పార్క్ జూనియర్ కాలేజ్ శ్రీనగ ర్ విద్యార్థలను అభినందించి ఉత్తమ ఫలితాలతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభి వృద్ధే ధ్యేయంగా నూతన ఆవిష్కరణలను ముఖద్వారంగా ఉంటూ విద్యార్థుల్లో మంచి క్రమశిక్షణ, నైపుణ్యాలను పెంపొందిస్తుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొని విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు.




